విజయవంతంగా నాంపల్లి లో బీజేపి భారీ బహిరంగ సభ || Huge Joinings From Telangana Districts To BJP

2019-08-19 1,665

The Bharatiya Janata Party focused on two Telugu states. The BJP is particularly aggressive on Telangana state. The BJP is planning to make the saffron scarf for all the leaders who are willing to join the party and set up a huge Public meeting in the nampally exhibition grounds.
#telangana
#bjp
#publicmeeting
#jpnadda
#trs
#congress
#tdp

భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై దూకుడు పెంచింది బీజేపి. ఇందులో బాగంగానే నాంపల్లి ఎగ్సిబీషన్ మైదానంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నాయకులందరికి కాషాయ కండువా కండువా కప్పాలని ప్రణాళిక రచిస్తోంది బీజేపి. రాష్ట్రానికి సంబందించిన వివిధ పార్టీలలోని నేతలతో పాటు టీడీపీ శ్రేణులంతా బీజేపీలో చేరేలా ఆపరేషన్‌ కమలం చేపడుతోంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేసింది. ఇటీవల టీడీపీ సీనియర్‌ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, నందీశ్వర్‌గౌడ్‌ ఇళ్లకు బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెళ్లి మరీ ఆహ్వానించారు. మరోవైపు రేపు ఆదివారం రోజున భారీ ఎత్తున టీడీపీ శ్రేణులను చేర్చుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీజేపి. ఈ కార్యక్రమానికి బీజేపి జాతీయ కార్యనిర్వాహక అద్యక్షుడు జేపి నడ్డా ముఖ్య అతిదిగా హాజరుకాబోతున్నారు.